VIDEO: 'సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలి'

ప్రకాశం: సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని కనిగిరి డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కె.శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమాచార హక్కు చట్టం నిబంధనలు, విధి విధానాలను వివరించారు. ప్రజలందరూ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకునేలా చూడాలన్నారు.