'తిరుమల లడ్డూ అంశంపై రాజకీయ డ్రామాలు ఆపాలి'

'తిరుమల లడ్డూ అంశంపై రాజకీయ డ్రామాలు ఆపాలి'

VSP: తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై రాజకీయ పార్టీలు సాగిస్తున్న డ్రామాలను తక్షణమే నిలిపివేయాలని భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చింతాడ సూర్యం డిమాండ్ చేశారు. కంచరపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత కక్షలతో హిందూ దేవాలయాల పవిత్రతను దెబ్బతీస్తూ, భక్తుల మనోభావాలతో రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయన్నారు.