కోర్టుకు హాజరైన వైసీపీ నేత గోరంట్ల మాధవ్
AP: ఓ కేసులో బాధితురాలి వివరాలను వైసీపీ నేత గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో ఆయనపై వాసిరెడ్డి పద్మ పిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇరు వైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 16కు వాయిదా వేసింది.