మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

KRNL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.