నేడు తంగెళ్ళలో 31వ ఉరుసు మహోత్సవం

ప్రకాశం: మర్రిపూడి మండలంలోని తంగెళ్ల గ్రామంలో గురువారం హజరత్ షా కాశింవలి బాబా 31వ ఉరుసు మహోత్సవం ఇస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. తంగెళ్ళ గ్రామంలో షేక్ మీరా సాహెబ్ ఇంటి వద్ద నుండి ఉదయం 11 గంటలకు గంధ మహోత్సవము జరుగుతుందన్నారు. సాయంకాలం ఊరేగింపు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.