ఉదయగిరిలో పెద్దపులి కలకలం.. గ్రామాల్లో హై అలర్ట్!

ఉదయగిరిలో పెద్దపులి కలకలం.. గ్రామాల్లో హై అలర్ట్!

NLR: ఉదయగిరి మండలం బండగానిపల్లి ఘాట్ రోడ్డు, శకునాలపల్లి అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని సమాచారం. దీంతో ఎస్ఈబీ కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి చినబాబు.. లింగంనేనిపల్లి, బిజ్జంపల్లి, బండగానిపల్లి, కృష్ణారెడ్డిపల్లి గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.