అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌లు పట్టివేత

MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలోని వాగు నుంచి మంగళవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు SI భాస్కర రావు అన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు దంపూర్ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం కోర్ట్‌లో హాజరుపరిచామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.