'ఈ-పంట నమోదు పారదర్శకంగా జరగాలి'
PPM: జిల్లాలో ఈ-పంట నమోదు పారదర్శకంగా జరగాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమ పథకాల సులభతరానికి నిజమైన రైతు డేటా అవసరమన్నారు. మంగళవారం సీతానగరం మండలం కాసాపేట గ్రామంలో జరుగుతున్న ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని జెసీ తనిఖీ చేశారు.