మేడారం వనదేవతల సన్నిధిలో భక్తులు
MLG: తాడ్వాయి మండలంలోని మేడారానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు ఆదివారం సెలువుదినం కావడంతో గద్దెల వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్క ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివచ్చి, మొక్కలు చెల్లించుకుంటున్నారు. గద్దెల పరిసర ప్రాంతాల్లో సరదాగా గడుపుతున్నారు.