బీసీసీఐకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ
ఆసియా కప్ 2027 ఆతిథ్య హక్కులు దక్కించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు BCCIతో సత్సంబంధాల కోసం ముందడుగు వేసింది. టీమిండియాను తమ దేశానికి పంపాలని కోరుతూ తాజాగా బీసీసీఐకి లేఖ రాసింది. గతంలో T20 WC సమయంలో భారత్‌తో పేచీ పెట్టుకున్న బంగ్లా, ఇప్పుడు ఆర్థిక నష్ట భయంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ భారత్ రాకపోతే వేదిక శ్రీలంక లేదా UAEకి మారడం ఖాయమని సమాచారం.