'పూడికతీత, డ్రైన్ల నిర్వహణకు రూ.3.5 కోట్లు మంజూరు'
కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో కాలువల పూడికతీత, డ్రైన్ల నిర్వహణకు ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. కాలువల పూడికతీతకు రూ. 2.5 కోట్లు, డ్రైన్ల పనులకు రూ.1కోటి కేటాయించామన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో మాట్లాడిన ఆయన, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు