సీతమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

సీతమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

AP: చిత్తూరులోని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల భవనంపై నుంచి దూకి బీటెక్ సెకండియర్ విద్యార్థి రుద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఇదే కళాశాలలో వారం క్రితం భవనంపై నుంచి నందిని అనే విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.