ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక పూజలు

ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక పూజలు

MDK: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని అమ్మవారికి ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున అర్చకుడు రావికోటి పార్థివ శర్మ మంజీరా నదీజలాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం పట్టువస్త్రాలు అలంకరించి, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక సహస్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. పూజలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.