202 మంది విద్యార్థులు ఆబ్సెంట్

SKLM: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని RIO తవిటి నాయుడు తెలిపారు. 3,709 మంది విద్యార్థులకు 3,507 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 202 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని వెల్లడించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.