మోదీ మౌనం వహించడంపై సోనియా మండిపాటు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందటంపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మండిపడ్డారు. ఖమేనీ హత్యపై కేంద్రం మౌనాన్ని తప్పుబట్టారు. భారత్ మౌనం వహించడం అనేది తటస్థ వైఖరి కాదని.. మన విదేశీ విధానం విశ్వసనీయతను దెబ్బతీసే 'బాధ్యతా రాహిత్యం' అని ధ్వజమెత్తారు. ఈ యుద్ధంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.