VIDEO: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. భారీ ట్రాఫిక్ జామ్

VIDEO: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. భారీ ట్రాఫిక్ జామ్

కొత్తగూడెం: జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఆర్టీసీ బస్సును మరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆశ్వరావుపేట-ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.