యూటీఎఫ్ ఆఫీసులో ప్రపంచ కార్మికుల దినోత్సవం

విజయనగరం జిల్లా: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గజపతినగరం యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి చింతా భాస్కరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాద్యాయ, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, హక్కులు కాపాడుకోవడానికి చైతన్యంతో కలిసికట్టుగా పోరుబాటకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఎస్ కన్వీనర్ పాల్గొన్నారు.