రామన్నగూడెం రోడ్డుపై మళ్లీ విచిత్ర పూజలు
MLG: ఏటూరునాగారం మండలంలోని ఏటూరునాగారం-రామన్నగూడెం మధ్య ప్రధాన రహదారిలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు, మళ్లీ విచిత్రంగా పూజలు చేసిన ఆనవాళ్లు బయటపడ్డాయి. రోడ్డు మధ్యలో కుండ, అన్నం ముద్దలు, పసుపు-కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వెళ్లారు. ప్రతి శని, ఆదివారం ఇలాంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.