తలుపులమ్మను దర్శించుకున్న భక్తులు

తలుపులమ్మను దర్శించుకున్న భక్తులు

E.G: తుని రూరల్ మండలం లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మ వారిని ఆదివారం వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 5వేల మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డు ప్రసాదం, వసతి గదుల అద్దెలు, పూజా టిక్కెట్లు, విరాళాలు, ఇతర విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.3,08,871 ఆదాయం లభించిందన్నారు.