ఛలో హైదరాబాద్‌కు తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు
NZB: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నాయకులు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకుడు కిష్టయ్య మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఇందల్వాయి టోల్‌ప్లజా నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.