జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు
మెదక్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 226 నుంచి రూ. 240 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 10 వరకు పెరిగింది. స్థానిక ఎలక్షన్ ప్రభావంతో మరింత పెరిగే అవకాశం ఉంటుందని మాంస ప్రియులు అంటున్నారు.