'హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ప్రయాణించండి'
MBNR: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని బాలానగర్ SI లెనిన్ సూచించారు. మండలంలోని గుండేడు గ్రామంలో నిర్వహించిన "Arrive - Alive" కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మంది సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్లే మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.