'వారపు సంత పాట సొమ్మును రికవరీ చేయాలి'

'వారపు సంత పాట  సొమ్మును రికవరీ చేయాలి'

E.G: గోకవరం పంచాయతీ వారపు సంత పాటల సొమ్మును రికవరీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం పంచాయతీ సెక్రటరీ సూరిబాబుకు వినతిపత్రం అందజేశారు. 2020 నుంచి గేదెలు, మేకలు, ఇతర దుకాణాల పేరుతో జరుగుతున్న వేలం పాటల్లో అక్రమాలు జరిగాయని, ఆ నిధులను వెంటనే వసూలు చేయాలని ఆయన కోరారు.