చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి
E.G: రాజమండ్రిలోని క్వారీ సెంటర్ వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగర పాల సంస్థ పలు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. వీటిని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.