ఎనిమిది కేజీల గంజాయి స్వాధీనం..
AKP: నాతవరం మండలం చమ్మచింత వద్ద ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా నలుగురు వ్యక్తులు ఎనిమిది కేజీలు గంజాయి తీసుకు వెళ్తూ పట్టుబడ్డారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని నాతవరం ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.