రూప్లాతండాలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు
NLG: త్రిపురారం మండలం రూప్లాతండా గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ ధనావత్ రఘు నాయక్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.