నేడు బనగానపల్లెలో మంత్రి ప్రజా దర్బార్
NDL: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని టీడీపీ నేతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.