VIDEO: లింగపాలెంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ELR: లింగపాలెం మండలంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. గరిమళ్ళ చలపతిరావు జెండా ఎగరవేసి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎన్టీఆర్ పేదవాడి గొంతుకై పోరాడారని, చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.