VIDEO: చెప్పుల షాపులో నగదు కాజేసిన కిలాడీ లేడీ
అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల 'మయూరి షూ మార్ట్'లో సోమవారం సాయంత్రం ఒక మహిళా దొంగ కస్టమర్ తరహాలో లోపలికి వచ్చి, అత్యంత చాకచక్యంగా కౌంటర్‌లోని నగదును దొంగిలించింది. చెప్పులు కొనే నెపంతో షాపు యజమాని దృష్టి మళ్లించి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలన్నీ దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.