ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదు: ఎమ్మెల్యే

ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదు: ఎమ్మెల్యే

కడప: ఏపీలో ఇక YCPకి భవిష్యత్తు లేదని, జగన్ ఒక రాజకీయ అజ్ఞానిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని MLA వరదరాజులరెడ్డి విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంటే జగన్ బురద రాజకీయాలు చేయడం హేయమైన చర్యన్నారు. లక్షల కోట్ల అధిపతి అయిన జగన్ ఎందుకు సహాయం చెయ్యలేదన్నారు.