నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ పట్టణంలోని పవనపుత్ర కాలనీలో ఆదివారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.