ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే

CTR: పుంగనూరు రూరల్ ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే మంగళవారం నిర్వహించారు. డాక్టర్ పవన్ కుమార్ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీకీ కనీసం నాలుగు చెక్‌అప్‌లు చేయించాలని సూచించారు. ప్రతీ బిడ్డకు 5 ఏళ్ల వరకు ఉచిత టీకాలు వేయించాలని ఆదేశించారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.