షిర్డీ వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సు

SDPT: సిద్దిపేట నుంచి షిర్డీ వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా అధునాతన లగ్జరీ బస్సు నడిపించనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు 1న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయల్దేరుతుందని.. తుల్జాపూర్, షిర్డీ, శనిశింగనాపూర్ దర్శించుకుని తిరుగు ప్రయాణంలో పండరీపూర్ దర్శనం, ఆగస్టు 3న సిద్దిపేటకు చేరుకుంటుందన్నారు.