కేరళ, అసోంలో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేరళ, అసోంతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి(ఈ నెల 09న) పుదుచ్చేరితో పాటు కేరళ, అసోంలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసీ వెల్లడించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌కు ఎలాంటి అవాంతరాలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.