ఫిబ్రవరి 2 నుంచి సీఎం కప్ క్రీడలు
WNP: పెద్దమందడి మండల కేంద్రంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సీఎం కప్పు క్రీడలను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పరపతి వెల్లడించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రీడల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి మంజులత, పీడీలు అనిల్ కుమార్ పాల్గొన్నారు.