జిల్లాలో ఆరు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు
కృష్ణా: నల్లిని పోలిన స్క్రబ్ టైఫస్ కీటకం కుట్టడం ద్వారా సోకే జ్వరాలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. మచిలీపట్నం పరిదిలో ఆరు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి అవకాశం ఎక్కువగా వ్యవసాయ పనులు ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుందని వైద్యారోగ్య శాఖ అధికారి యుగంధర్ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.