కేంద్రంపై తమిళనాడు స్పీకర్ విమర్శలు
దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 4 రోజుల క్రితం 30 రోజుల నిల్వలున్నాయని చెప్పిన కేంద్రం, ఇప్పుడు కొరత ఎందుకుందో చెప్పాలని నిలదీశారు. ఇది కృత్రిమ కొరత అని, తన 'మిత్రుల'కు లాభం చేకూర్చేందుకే కేంద్రం ఇలా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరూ సీఎం స్టాలిన్ వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.