VIDEO: మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం
RR: మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు ఒక్కసారిగా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.