కారు- బైక్ ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

కారు- బైక్ ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

KMM: మణుగూరు పట్టణంలోని సీఎస్పీ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న ఓ కారు బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు రెండేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.