'సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి'

'సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి'

WG: సమ్మర్ క్యాంప్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈది ఫౌండేషన్ ఫౌండర్ ఈది రవికుమార్ అన్నారు. భీమవరం పెదపేట ఏదోను ప్రార్ధన మందిరంలో సండే స్కూల్ విద్యార్థులకు సమ్మర్ క్యాంపు నిర్వహించారు. సుమారు 300 విద్యార్థులకు ఉచితంగా నెలరోజులపాటు డాన్స్, పాటలు, మానసిక ధైర్యంపై శిక్షణ అందిస్తామని రవికుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.