నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

గుంటూరు టౌన్-4 సబ్ డివిజన్ పరిధిలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ పీ.హెచ్.ఖాన్ తెలిపారు. దీనివల్ల కాకుమానువారితోట, వల్లూరివారితోట, మాలకొండయ్యకాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వినియోగదారులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.