ప్రమాద ఘటనపై ఆటో చోదకులతో సీఐ సమావేశం

ప్రమాద ఘటనపై ఆటో చోదకులతో సీఐ సమావేశం

VZM: కొత్తవలస పట్టణ పరిధి ఆర్ధన్నపాలెంలో ఉన్న ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థులను తీసుకువెళ్లే ఆటో చోధకులతో శనివారం పట్టణ సీఐ షణ్ముఖ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు తీసుకువెళ్లే చోదకులు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని  తీసుకువెళ్లకూడదని కోరారు.