VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తులకు తీవ్ర గాయాలు
E.G: రాజమండ్రి కొంతమూరు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు వ్యక్తులు రాజమండ్రి నుంచి వస్తూ కొంతమూరు వద్ద డివైడర్‌ను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.