తెలంగాణలోని త్వరలో హెలీ టూరిజం: మంత్రి

NGKL: తెలంగాణలో హెలీ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమశిల, నల్లమల పర్యాటక రంగంలో హెలీ టూరిజాన్ని ప్రవేశపెట్టి పర్యాటకులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన అన్నారు. గగనతలంలో పర్యాటకులకు అహ్లాదకరమైన, మరపురాని అనుభూతిని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు.