'యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు విఫలం'
NLG: నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతుందని, ప్రభుత్వాలు యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ అన్నారు. ఆదివారం నల్గొండలో డీవైఎఫ్ఐ పట్టణ మహాసభలు జరిగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.