అహ్లాదకరంగా రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాలు

అహ్లాదకరంగా రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాలు

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం గుడుపల్లి శివారులోని పురాతన రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆ ప్రాంతానికి కొత్త శోభ తెచ్చాయి. ఆలయ సమీపం నుంచి పారుతున్న వాగు పలుచోట్ల గుట్టల మధ్య జలపాతాలుగా కనిపిస్తూ అలరిస్తోంది.