'విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అధ్యాపకులు దోహదపడాలి'
BHPL: విద్యార్థులు అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి అధ్యాపకులు దోహదపడాలని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అన్నారు. శుక్రవారం ద్విసభ్య కమిటీ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధన, విద్యా వనరుల తనిఖీ చేపట్టారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.