స్పా సెంటర్లలో తనఖీలు

VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఒకటవ పట్టణంలో ఉన్న పలు స్పా సెంటర్లను శనివారం మూకుమ్మడి తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో ఎటువంటి కార్యకలాపాలు బయట పడలేదని సీఐ చౌదరి తెలిపారు. స్పా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. చట్టబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. తనిఖీల్లో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.