అద్దంకిలో మహిళలకు ‘అక్షరాంధ్ర’ పరీక్షలు

అద్దంకిలో మహిళలకు ‘అక్షరాంధ్ర’ పరీక్షలు

BPT: అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో మహిళల కోసం నిర్వహించిన ‘అక్షరాంధ్ర’ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పర్యవేక్షణలో అధికారులు పరీక్షలను సక్రమంగా నిర్వహించారు. నిరక్షరాస్య వయోజన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పట్టణానికి చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొని పరీక్షలు రాశారు.