మహారాష్ట్ర సీఎంతో అనకాపల్లి ఎంపీ భేటీ

AKP: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ముంబైలో సోమవారం భేటీ అయ్యారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించినట్లు రమేష్ పేర్కొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు పెంపొందించడంలో కృషి చేస్తున్న రమేష్‌కు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.